డి.సురేష్‌బాబు సమర్పించిన ‘పిట్టగోడ’ మూవీ రివ్యూ, రేటింగ్

pittagoda movie review rating punarnavi bhupalam

Here is the exclusive review of Pittagoda movie. This movie executed by director very well which impresses every one.

సినిమా : పిట్టగోడ
నటీనటులు : విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి భూపాలం, ఉయ్యాల జంపాల రాజు, జబర్దస్త్‌ రాజు, తదితరులు
దర్శకుడు : అనుదీప్‌ కె.వి
నిర్మాతలు : దినేష్‌ కుమార్‌, రామ్మోహన్‌ పి
సినిమాటోగ్రఫీ : నగేష్ బానెల్
సంగీతం : ‘ప్రాణం’ కమలాకర్‌
సమర్పణ: డి. సురేష్‌ బాబు
రిలీజ్ డేట్ : 24-12-2016

ఈమధ్య టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా బాగానే నడుస్తోంది. ముఖ్యంగా.. యూత్‌ని ఆకట్టుకునే లవ్ స్టోరీలు, ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో వచ్చే మూవీలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే.. ఆ సినిమా కథలు యూత్ అభిరుచులకు దగ్గరగా ఉండడంతో వాళ్లు సులువగా కనెక్ట్ అయిపోతున్నారు. అందుకే.. ఆ తరహా చిత్రాలు తీసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి కోవకే ‘పిట్టగోడ’ చెందింది.

నలుగురు స్నేహితుల ప్రయాణం ఎలా సాగిందన్న అంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. టీజర్లతో మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. విశ్వదేవ్, పునర్నవి భూపాలం జంటగా నూతన దర్శకుడు కేవీ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగింది. మరి.. ఆ అంచనాలను అందుకోవడంలో ఇది సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకోవాల్సిందే.

కథ :
తెలంగాణాలోని గోదావరిఖని అనే ఊరిలో టిప్పు, బిల్డప్‌ వేణు, జ్ఞానేశ్వర్‌, నాగరాజు అనే నలుగురు స్నేహితులు పనీపాటా లేకుండా తిరుగుతుంటారు. వీళ్లు ‘పిట్టగోడ’ ఎక్కి ఏవేవో కబుర్లు చెప్పుకొంటుంటారు. వీళ్ళకి తమ ఊరిలోనే కాదు.. ఇంట్లోనూ గౌరవం ఉండదు. అందరితోనూ నిత్యం తిట్లు తింటూనే ఉంటారు. అయితే.. ఓరోజు ఆ నలుగురిలో ఓ మార్పు వస్తుంది. ఎలాగైనా అందరిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో.. మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటును కండక్ట్ చేయాలని అనుకుంటారు. ఆ ఆలోచన తట్టిన వెంటనే దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. పెద్ద మొత్తంలో ఎంట్రీ ఫీజులు వసూలు చేసి అన్ని ఏర్పాట్లను చేసుకుంటారు.

ఈ క్రమంలోనే దివ్య (పునర్నవి) అనే అమ్మాయితో టిప్పు ప్రేమలో పడతాడు. తీరా టోర్నమెంట్‌కు ముందు రోజు రాత్రి టిప్పు ఎవరూ ఊహించని ఒక నిర్ణయం తీసుకుంటాడు. దాంతో టిప్పు, అతని ముగ్గురు స్నేహితులు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. ఇంతకీ.. టిప్పు తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి ? అసలు అతను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? దాని వలన టిప్పుకి, అతని ప్రేమకు, స్నేహానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? చివరికి.. వీళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి ? అనే అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
సాధారణంగా యూత్‌కి సంబంధించిన సినిమాలు వస్తున్నాయంటే.. వాటిలో కాలేజ్ లైఫ్, ఫ్రెండ్‌షిప్, లవ్, డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఏదో కొంత కామెడీ మాత్రమే ఉంటుందన్న భావన ప్రతిఒక్కరిలోనూ ఉంది. కానీ.. ‘పిట్టగోడ’ అలాంటి కేటగిరీకి సంబంధించింది కాదు. ఆ తరహా సినిమాలతో దీన్ని పోల్చలేం. అంత డిఫరెంట్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కథ వాస్తవానికి దగ్గరగా ఉండడంతో.. రోజూ చూసే వాతావరణంలాగే అనిపిస్తుంది.

ఫస్టాఫ్ గురించి మాట్లాడుకుంటే.. మొదటినుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అనవసరమైన, బలవంతపు సీన్లు జోడించకుండా.. నలుగురు కుర్రాళ్లు, వాళ్ల జీవన శైలిని వివరించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. మధ్యమధ్యలో వచ్చే కామెడీ ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. స్నేహబంధాన్ని ఎలివేట్ చేసే సీన్లు బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్ కథనం కూడా ఇంట్రెస్టింగ్‌గానే నడుస్తుంది. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చాక.. ఫ్రెండ్‌షిప్ స్టోరీ కాస్త ‘లవ్ స్టోరీ’గా టర్న్ తీసుకుంటుంది. హీరో, హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ కొత్తగా, ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. అవసరమైన చోట మాత్రమే వచ్చే పాటలు వినసొంపుగా ఉన్నాయి. ప్రీ-క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగా నడిచే ఈ సినిమా.. సాధారణ క్లైమాక్స్ ఎపిసోడ్‌తో ముగుస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే.. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చేవరకు సినిమా చకచకా సాగిపోతుంది. ఆమె ఎంట్రీ అయ్యాక సినిమా కాస్త పక్కదారి పట్టినట్లు ఉంటుంది. క్లైమాక్స్ సాధారణంగా ఉండడం ఈ మూవీకి మేజర్ మైనస్ పాయింట్. ఫస్టాఫ్, సెకండాఫ్ కథా కథనాలను ఇంట్రెస్టింగ్‌గా నడిపిన దర్శకుడు.. క్లైమాక్స్‌ను మాత్రం చాలా సాదాసీదాగా ముగించేశాడు. చివర్లో ఏదైనా ఓ అంశానికి తారాస్థాయికి తీసుకెళ్లి ఎమోషనల్‌గా సినిమాను ముగిస్తాడని అనుకుంటే.. నిరుత్సాహం ఎదురైంది. దివ్యకేదో భయంకరమైన ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుందనుకొంటే.. దాన్ని కూడా తేల్చేశారు. పతాక సన్నివేశాలు మరింత మెరుగ్గా తీస్తే బాగుండేది.

నటీనటుల పనితీరు :
టిప్పుగా కనిపించిన విశ్వదేవ్ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇతని స్నేహితులుగా నటించిన మిగతా ముగ్గురు కూడా మంచి నటన కనబరిచారు. ఏ ఒక్కరూ అతికిపోకుండా సింపుల్‌గా తమ ప్రతిభ చాటుకున్నారు. ఇక హీరోయిన్‌గా నటించిన పునర్నవి భూపాలం కూడా సహజ నటనతో ఆకట్టుకుంది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి బాగానే ఆకట్టుకున్నారు.

సాంకేతిక పనితీరు :
నగేష్ బానెల్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రాణం కమలాకర్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌. పి ల నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు కెవి ఆనంద్ విషయానికొస్తే.. సింపుల్ స్టోరీని, రియలిస్టిక్‌గా రాసుకుని అలాగే తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్‌పై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

ఫైనల్ వర్డ్ : యూత్‌ని ఆకట్టుకునే సినిమా
‘పిట్టగోడ’ మూవీ రేటింగ్ : 3/5

Share Your Thoughts

comments

Tags: , , , , , , , , , , ,
Latest Telugu Movie News
‘ఖైదీ నెంబర్ 150’ తొమ్మిది రోజుల కలెక్షన్లు – మూడవ స్థానంలోకి దూసుకొచ్చిన మెగాస్టార్ !!
‘శాతకర్ణి’ ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.. కెరీర్‌లో బెస్ట్ రికార్డ్
ఖైదీ, శాతకర్ణిల పోటీమధ్య అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ‘శతమానం భవతి’
అఫీషియల్ : ఏరియాలవారీగా ‘ఖైదీ నెం.150’ 7 రోజుల వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వివరాలు
‘ఖైదీ నెం.150’ 7 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.. చెలరేగిపోయిన చిరంజీవి
చిరంజీవిని ఆకాశానికెత్తేశాడు రాంగోపాల్ వర్మ
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 6 రోజుల (ఏపీ+నైజాం) కలెక్షన్స్ వివరాలు..
తొలిసారి ఆ సాహసం చేస్తున్న చరణ్.. అంతా తండ్రి కోసమే!
‘శతమానం భవతి’ 4 రోజుల కలెక్షన్స్.. ఆ మార్క్‌ని దాటేసిన శర్వానంద్
‘ఖైదీ నెం.150’ 7 రోజుల యూఎస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన బాస్
Latest Telugu News
‘జల్లికట్టు , కోడిపందేల’ వివాదాలపై కేంద్రంపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్
పోటి ఉంటేనే వొళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం : “ఖైదీ ,శాతకర్ణి లపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు
సినిమాల్లో అవకాశాలు ఇస్తానని మోడల్‌ని రేప్ చేసిన షారుఖ్ ఖాన్ నిర్మాత
విరిగిన ‘మనసు’కి తండ్రితో ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్న నిహారిక
సంక్రాంతిరోజు బడాబాబుతో వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కైన హీరోయిన్
టాలీవుడ్ స్టార్ హీరోలపై కాజల్ కామెంట్స్
ప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి
ఆ అరుదైన గౌరవం దక్కించుకుని.. చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్
అతడికి 13.. ఆమెకు 25.. ఆ పని చేసినందుకు టీచర్‌కి పదేళ్ల జైలు శిక్ష
భళా పులోమావి భళా.. ఎన్టీఆర్ డైలాగ్‌ని అలవోకగా చెప్పేసిన ‘శాతకర్ణి’ కుమారుడు
Telugu Latest Gossips
షాకింగ్: బయటపడ్డ రకుల్ ప్రీత్ సీక్రెట్ ఎఫైర్.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. అల్లు అర్జున్ ‘అదుర్స్’
మాస్టర్ ప్లాన్‌తో ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చిన రవితేజ
చిరంజీవి, బాలయ్య కాంబినేషన్‌.. రక్తికట్టించేందుకు మరో స్టార్ హీరో?
‘శాతకర్ణి’ ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా.. బాలయ్య దేశం మీసం తిప్పడం గ్యారంటీ అంటున్న ట్రేడ్ వర్గాలు
తారక్ 27వ సినిమాకి తాత టైటిల్ ఫిక్స్.. ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిష్టర్ చేసిన కళ్యాణ్ రామ్
‘ఖైదీ నెం.150’ ఫస్ట్ డే కలెక్షన్స్.. హిస్టారికల్ రికార్డ్ తప్పదంటున్న ట్రేడ్ వర్గాలు
చిరంజీవికి ఇచ్చినట్లుగా మహేష్‌కి పూరీ జగన్నాథ్ కౌంటర్..?
ఖైదీలో కనిపించనున్న మెగా హీరోలు ఎవరు? ఎంతసేపు? ఫుల్ డిటెయిల్స్
ఎన్టీఆర్ గ్రేట్, ఎన్టీఆర్ గ్రేటెస్ట్, ఎన్టీఆర్ బెస్ట్…కెరీర్ ప్లానింగ్ కేక!!
Latest Videos
రేర్ ఫీట్‌తో చరిత్ర సృష్టించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్
ప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి
‘లోకల్’ పవర్ చూపించిన నాని.. రెండు రోజుల్లో ట్రైలర్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్
ప్రేమ పేరుతో రామ్ లవర్‌ని తెగ ఇబ్బంది పెట్టిన ‘లోకల్’ నాని
మాస్‌లో క్లాస్ మిక్స్ చేసి.. ‘విన్నర్’ అనిపించుకున్న మెగాహీరో
భళా పులోమావి భళా.. ఎన్టీఆర్ డైలాగ్‌ని అలవోకగా చెప్పేసిన ‘శాతకర్ణి’ కుమారుడు
అమ్మడుతో బాలయ్య కుమ్ముడు.. యూట్యూబ్‌పై నెటిజన్ల దండయాత్ర (వీడియో)
ట్రైలర్ టాక్ : హాలీవుడ్‌ని తలపించేలా ‘ఘాజీ’ సబ్-మెరీన్ వార్ అదిరింది
ట్రైలర్ టాక్ : రంకుమొగుడి సత్తా చాటిన ‘గుంటూరోడు’
టీజర్ టాక్ : ఇల్లు-వాకిలి, ప్రేమా-దోమా, చెత్త-చెదారం అన్ని పక్కనపెట్టమంటున్న ‘గురు’