Moviesబాహుబలి సైతం కదల్చని తన రికార్డుని 15 ఏళ్ల తర్వాత తనే...

బాహుబలి సైతం కదల్చని తన రికార్డుని 15 ఏళ్ల తర్వాత తనే బద్దలు కొట్టిన మెగాస్టార్

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. నాన్ బాహుబలి రికార్డులని 11 రోజుల్లోనే తుడిచిపెట్టేసిన మెగాస్టార్.. బాహుబలి సైతం కదల్చని..15 ఏళ్ళు గా తన పేరు మీదే ఉన్న రికార్డుని మళ్ళీ తానే బద్దలు కొట్టడం విశేషం!

15 ఏళ్ల క్రితం అంటే 2002 లో విడుదలైన ‘ఇంద్ర’ ఈస్ట్ గోదావరి జిల్లాలో తుని లో అప్పట్లోనే 18 లక్షల షేర్ సాదించి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇక ఆ సినిమా తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించిన బాహుబలి కూడా ఆ రికార్డ్ కి చేరువ కాలేకపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు మెగాస్టార్ ఖైదీ 11వ రోజుకు 18.74 లక్షల షేర్ వసూలు చేసి అప్పటి తన పేరు మీదనే ఉన్న ఇంద్ర రికార్డును బద్దలు కొట్టింది. బాస్ ఈజ్ బ్యాక్ నిజమైన అర్థం చెప్పిన రికార్డిది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news