Movies'ఖైదీ నెంబర్ 150' తొమ్మిది రోజుల కలెక్షన్లు - మూడవ స్థానంలోకి...

‘ఖైదీ నెంబర్ 150’ తొమ్మిది రోజుల కలెక్షన్లు – మూడవ స్థానంలోకి దూసుకొచ్చిన మెగాస్టార్ !!

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సంక్రాంతి పండుగ అయిపోయినట్లుగా లేదు.. పండగ సందర్బంగా రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొడుతూ పండగ వాతావరణాన్ని మరింతగా పొడిగిస్తుంది. అవును ఎంతైనా ‘బాస్ ఈజ్ బ్యాక్’ కదా మరి!. ఆంధ్రా తెలంగాణాల్లో ఖైదీ 9 వ రోజు కూడా తన సత్తా చాటుతూ మంచి కలెక్షన్లు రాబట్టింది.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లలో 9 రోజుల కలెక్షన్లు ఈ క్రింది విదముగా ఉన్నాయి(కొట్లలో )..

నైజాం : 15.10
సీడెడ్ : 11.70
ఉత్తరాంధ్ర : 9.44
ఈస్ట్ గోదావరి : 6.82
గుంటూరు : 5.91
వెస్ట్ గోదావరి : 5.91
కృష్ణా : 4.51
నెల్లూరు : 2.68
ఏపీ+తెలంగాణ : రూ. 61.35 కోట్లు(share)

ఆంధ్రా లో మొత్తం గ్రాస్ :రూ. 44.40 కోట్లు

సీడెడ్ లో గ్రాస్ రూ. 14.10 కోట్లు
నైజాం లో గ్రాస్ రూ. 20.50 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం గ్రాస్ : రూ. 79 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా 82.5 కోట్ల రూపాయలు షేర్ వచినట్లుగా సమాచారం. కేవలం తెలుగు బాషలో రిలీజ్ అయిన సినిమాల జాబితాలో మూడవ స్థానాన్ని మరియు ఆల్ టైం టాలీవుడ్ సినిమాల జాబితాలో 4వ స్థానాన్ని… అది కూడా విడుదలయిన తొమ్మిది రోజుల్లోనే సాదించడం… నిజంగా మెగాస్టార్ అంటే ఏంటో చూపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news