Movies‘ఖైదీ నెంబర్ 150’ మూవీ ప్రీ-రివ్యూ.. బాస్ రీ-ఎంట్రీతో రికార్డులు బద్దలే!

‘ఖైదీ నెంబర్ 150’ మూవీ ప్రీ-రివ్యూ.. బాస్ రీ-ఎంట్రీతో రికార్డులు బద్దలే!

Khaidi no 150 Telugu movie Pre Review Rating

Khaidi no 150 Telugu movie Pre Review Rating : Here is the exclusive pre review of Megastar Chiranjeevi’s milestone movie ‘Khaidi no 150’. This Khaidi no 150 movie was directed by VV Vinayak and produced by Ram Charan under his own banner ‘Konidela Production Company’.  Kajal Agarwal played lead female role opposite to Mega Star Chiranjeevi. ‘Khaidi no 150’  is going to hit screens on 2017-01-11 . This movie has a genre as action/drama movie. This movie made such huge business in Tollywood industry.

Click Here for Read in english : Khaidi No 150 Telugu Movie Review Rating

  • సినిమా : ఖైదీ నెంబర్ 150
  • నటీనటులు : చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా, ఆలీ, బ్రహ్మానందం, తదితరులు
  • దర్శకుడు : వివి వినాయక్
  • నిర్మాత : రామ్ చరణ్
  • సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
  • సినిమాటోగ్రఫీ : రత్నవేలు
  • ఎడిటర్ : గౌతమ్ రాజు
  • బ్యానర్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ

దాదాపు దశాబ్దకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ముఖానికి రంగు పూసుకుని వెండితెరకు రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది. రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీపై మొదటినుంచే తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించి పోస్టర్లు, టీజర్స్, ఆడియో సాంగ్స్, ట్రైలర్లకి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో.. దీనికి మరింత క్రేజ్ వచ్చిపడింది. పైగా ఇది చిరు రీఎంట్రీ మూవీ కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియెన్స్ దీనికోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. చిరు తన గత స్టామినాతోనే అందరినీ మెప్పిస్తారని ఆశిస్తున్నారు. మరి.. ఆ అంచనాల్ని అందుకోవడంలో చిరు ఎంతవరకు సక్సెస్ అయ్యారో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే.

కథ :
ఓ ప్రైవేట్ కంపెనీవారు తన స్వలాభం కోసం ఓ గ్రామంలోని రైతుల భూముల్ని బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తారు. వాటిమీదే ఆధారపడి బ్రతుకుతున్న రైతులకు అన్యాయం జరగకూడదని వీరికోసం ఆ కంపెనీవారి ప్రయత్నాలకు అడ్డుకునేందుకు శంకర్ (చిరంజీవి) అనే యువకుడు పోరాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఇతనికి ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ప్రదేశంలోనే.. జైలు నుంచి పారిపోయి వచ్చిన ‘ఖైదీ’ (చిరంజీవి) ఉంటాడు. తన పోలికలతో ఉన్న శంకర్‌ని చూసి ఖైదీ ఖంగుతింటాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న శంకర్‌ని వెంటనే ఆసుపత్రిలో చేర్పిస్తాడు. శంకర్ దగ్గర భూములకు సంబంధించి కొన్ని పత్రాలు ఉండడంతో… అతనొక ఆస్తిపరుడని భావించి, ఆ డబ్బుని తన సొంతం చేసుకుందామన్న ఉద్దేశంతో అతని గ్రామానికి వెళతాడు.

అలా వెళ్లిన అతనికి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుస్తాయి. వారి భూముల్ని లాక్కోవడానికి కార్పొరేట్ వాళ్లు కసరత్తులు చేస్తున్నారని తెలుసుకుంటాడు. అప్పుడతడు వారికి విరుద్ధంగా పోరాటం మొదలుపెడతాడు. రకరకాల ప్లాన్స్ వేస్తాడు. మరి.. ఆ ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయా? ఇంతకీ అతను వేసిన ఆ ప్రణాళికలు ఏంటి? ఎలా కార్పొరేట్ సంస్థలతో పోరాడుతాడు? ఆసుపత్రిలో ఉన్న శంకర్ ఏమయ్యాడు? అసలు కాజల్ పాత్రేమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా కథ నడుస్తుంది.

విశ్లేషణ :
తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుకూలంగా బాగా తెరకెక్కించారు. చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగానే కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి.. అదరహో అనే రేంజ్‌లో వినాయక్ రూపొందించాడు. బాస్ ఈజ్ రియల్లీ బ్యాక్ అనేలా ఆయనతో స్టెప్పులు, యాక్షన్ సీన్లు అద్భుతంగా చేయించాడు. ఎక్కడా బోరింగ్ లేకుండా.. సినిమాని ట్విస్టులతో ఇంట్రెస్టింగ్‌గా సాగేలా చూశాడు. సాధారణంగా రీమేక్ సినిమాల్ని హ్యాండిల్ చేయడమంటే కష్టం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినాయక్ చాలా జాగ్రత్తగా ఈ మూవీని డీల్ చేశాడు.

కథ విషయానికొస్తే.. ప్రారంభమే ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది. స్టోరీలైన్ ఏంటో మొదట్లోనే అర్థం అవుతుంది కానీ.. దాన్ని ఆసక్తికరంగా లాగారు. మధ్యలో కామెడీ ఎపిసోడ్స్‌తో కడుపుబ్బా నవ్వించారు. కాజల్, చిరుల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ కూడా ముచ్చటగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మైండ్‌బ్లోయింగ్. అక్కడొచ్చే కాయిన్ ఫైట్ ఈ మూవీకే హైలైట్. ఆ తర్వాత సెకండాఫ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. విలన్లకు వ్యతిరేకగా హీరో వేసే ఎత్తుగడలు వారెవ్వా అనేలా ఉంటాయి. మైండ్ గేమ్‌తో భలే థ్రిల్లింగ్‌గా సాగేలా చేశారు. ఇక క్లైమాక్స్ కూడా అదిరిపోయింది. అక్కడొచ్చే ఓ ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేసేస్తుంది.

ఓవరాల్‌గా ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు.. బాస్ ఈజ్ బ్యాక్ అంటారు. అంతేకాదు.. రీమేక్ అన్న సంగతి మర్చిపోయి, సరైన కథతో రీఎంట్రీ ఇచ్చారన్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్యలో ఎక్కడా బోర్ కొట్టించకుండా ఈ సినిమాని తెరకెక్కించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

నటీనటుల పనితీరు :
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పదేళ్ల గ్యాప్ వచ్చినా.. ఆయనలో అదే ఠీవీ, ఎనర్జీ, నటనా ప్రతిభ కనిపిస్తుంది. అసలు ఆయన్ను ‘మెగాస్టార్’ ఎందుకంటారో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. కళ్లలో కనిపించే ఇంటెన్సిటీ, ఎమోషనల్ సీన్లలో పలికే హావభావాలు, డ్యాన్స్, యాక్షన్ సీన్స్.. ఇలా అన్నింటిలోనూ ఆయన చూపిన ప్రతిభకి మార్కులు వేయడానికి అంకెలు సరిపోవు. హీరోయిన్‌గా కాజల్ ఎప్పట్లానే తన అందంతోనూ, నటనతోనూ ఆకట్టుకుంది. విలన్‌గా నటించిన తరుణ్ అరోరా అద్భుత అభినయం చూపించాడు. నెగెటివ్ షేడ్స్ పాత్రలో జీవించేశాడు. బ్రహ్మానందం, ఆలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఆడియెన్స్‌ని నవ్వించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇతర నటీనటులు తమ పాత్రలకు సరైన న్యాయం చేకూర్చారు.

టెక్నికల్ పనితీరు :
ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ సినిమాటోగ్రఫర్స్‌లో రత్నవేలు ఒకడు. హీరోలు ఎలివేట్ అయ్యేలా చూపించడంలోనూ, ప్రతి ఫ్రేమ్‌ని కలర్‌ఫుల్‌గా, గ్రాండ్‌గా చూపించడంలో తన టాలెంట్ ఏంటో ఆల్రెడీ నిరూపించుకున్నాడు. ఈ మూవీలోనూ అతను కెమెరా పనితనానికి మెచ్చుకోలేక ఉండలేరు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేశాడు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క బాగుంది. రాంచరణ్ నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. చాలా లావిష్‌గా తన తండ్రి చిత్రాన్ని నిర్మించాడు.

ఇక వినాయక్ గురించి మాట్లాడితే.. ఈ రీమేక్ చిత్రాన్ని ఒరిజినాలిటీ మిస్ కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించడంలో పూర్తిగా సఫలమయ్యాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిరు ఇతనిపై ప్రశంసల వర్షం ఎందుకు కురిపించారో.. సినిమా చూశాక అర్థం అవుతుంది. జనాలు ఏదైతే కోరుకున్నారో.. ఆ ఔట్‌పుట్ రాబట్టడంలో పాసయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. చిరులాగే వినాయక్ కూడా బ్యాక్ అని చెప్పుకోవచ్చు.

ఫైనల్ వర్డ్ : ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆశిస్తూ..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news