Moviesఅక్కడ ‘శాతకర్ణి’ మీసం తిప్పితే..‘ఖైదీ’ కుమ్మేశాడు

అక్కడ ‘శాతకర్ణి’ మీసం తిప్పితే..‘ఖైదీ’ కుమ్మేశాడు

Megastar Chiranjeevi and Balayya reached dream mark in us market with their prestigious projects Khaidi no 150 and Gautamiputra Satakarni.

తమ ప్రతిష్టాత్మక 150, 100వ చిత్రాల ద్వారా చిరంజీవి, బాలయ్యలు యూఎస్ బాక్సాఫీస్‌ని ఓ ఆటాడుకుంటున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను సైతం డామినేట్ చేస్తూ.. తమ సత్తా చాటుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్‌లోనే ఒక్కొక్కొరు ఒక్కో మైలురాయిని అందుకుని, అక్కడి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

తొలుత చిరు ‘ఖైదీ నెం.150’ సినిమా గుర్తించి మాట్లాడుకుంటే.. ప్రీమియర్ల ద్వారానే ఏకంగా $1.29 మిలియన్ డాలర్స్ సాధించింది. ఇక ఆ తర్వాత డీసెంట్ వసూళ్లు రాబడుతూ.. చివరికి 2 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేశాడు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రీమియర్స్‌తో కలుపుకుని ఆదివారం వరకు ‘ఖైదీ’ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘2 మిలియన్ల 77వేల డాలర్లు’ కలెక్ట్ చేసింది. దీంతో.. యూఎస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. తొలిమూడు స్థానాల్లో వరుసగా ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’, ‘అ..ఆ’ సినిమాలున్నాయి. ‘ఖైదీ’ దూకుడు చూస్తుంటే.. త్వరలోనే ఇది ‘అ..ఆ’ రికార్డ్‌ని బ్రేక్ చేయవచ్చునని భావిస్తున్నారు.

ఇక శాతకర్ణి విషయానికొస్తే.. ఇది క్రీ.శ.1-2 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన శాతవాహనుల చక్రవర్తి ‘శాతకర్ణి’ నిజజీవితం ఆధారంగా తెరకెక్కడంతో అక్కడి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో.. ఈ సినిమాకి ఊహించని వసూళ్లు వచ్చాయి. ప్రీమియర్ల ద్వారానే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత కూడా సత్తా చాటింది. దాంతో.. అప్పుడే ఇది 1 మిలియన్ క్లబ్‌లో చేరిపోయింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రీమియర్స్ నుంచి ఆదివారం వరకు ఈ చిత్రం ‘11లక్షల 80వేల 904 డాలర్లు’ కలెక్ట్ చేసింది. ఈ సినిమా ద్వారా బాలయ్య మొట్టమొదటి సారిగా మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news