Moviesఖైదీ, శాతకర్ణిలపై స్టన్నింగ్ కామెంట్స్ చేసిన కళ్యాణ్ రామ్

ఖైదీ, శాతకర్ణిలపై స్టన్నింగ్ కామెంట్స్ చేసిన కళ్యాణ్ రామ్

Kalyan Ram stunning comments on Gautamiputra Satakarni and Khaidi no 150 movies through twitter which is going viral on social media.

ఈ సంక్రాంతికి విడుదలైన రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు ‘ఖైదీ నెం.150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లకి బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. ఓ మంచి మెసేజ్‌తో చిరు అదిరిపోయే రీఎంట్రీ ఇస్తే.. ఓ హిస్టారికల్ సినిమాతో బాలయ్య గర్జించారు. ఇద్దరూ తమ మైలురాయిల్లాంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుండడంతోపాటు.. అభిమానుల మనసుని కూడా చూరగొన్నారు. దీంతో.. ఆ లెజెండ్స్‌పై ఫ్యాన్స్ నుంచే కాకుండా ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి వారిద్దరి మూవీలపై పొగడ్తల వర్షం కురిపించాడు. బాస్ రీఎంట్రీ అదిరిందని.. తక్కువ టైంలోనే కళ్లుచెదిరే గ్రాఫిక్స్‌తో రూపొందిన ‘శాతకర్ణి’ చరిత్రలో నిలిచిపోతుందని అన్నాడు. కళ్యాణ్ రామ్ కూడా స్టన్నింగ్ కామెంట్స్ చేశాడు.

‘శాతకర్ణి’ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందని తెలిపిన కళ్యాణ్.. ‘ఖైదీ’కి అన్నిచోట్ల నుంచి విపరీతమైన పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండడంతో చిరుకి కంగ్రాట్స్ చెప్పాడు. ఈ ఏడాది ఆ రెండు మంచి సినిమాలతో శుభారంభం అయ్యిందని చెప్పాడు. అలాగే.. ఈ సంక్రాంతికి విడుదల కానున్న మరో రెండు సినిమాలను విష్ చేశాడు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చాలా అద్భుతంగా ఉంది. 2017 శుభారంభం అయ్యింది. ‘ఖైదీ నెం.150’ సినిమాకిగాను చిరంజీవికి అభినందనలు. శతమానం భవతి, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు. ‘శాతకర్ణి’ రిలీజ్‌కి ముందు రామ్ చరణ్, అల్లుఅర్జున్, సాయి ధరమ్ తేజ్‌లు ఆ మూవీని, బాలయ్యని విష్ చేయడం.. ఇప్పుడు చిరుకి కళ్యాణ్ కంగ్రాట్స్ చెప్పుకోవడంతో.. ఇరువురి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news