ట్రైలర్ టాక్ : రంకుమొగుడి సత్తా చాటిన ‘గుంటూరోడు’

gunturodu trailer talk manchu manoj pragya jaiswal

Rocking star Manchu Manoj latest movie Gunturodu trailer has released and it is very impressive. Pragya Jaiswal look very beautiful in this trailer. This movie directed by SK Satya.

రాకింగ్ స్టార్ మంచుమనోజ్ కథానాయకుడిగా ఎస్.కే.సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరోడు’. ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈమధ్యే ఈ మూవీకి సంబంధించి రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది యూనిట్. అదెలాగుందో చూద్దాం పదండి..

ఈ ట్రైలర్‌లోనే సినిమా స్టోరీలైన్ ఏంటో క్లియర్‌గా చెప్పేశారు. ఓ అందమైన అమ్మాయిని చూసి హీరో లవ్‌లో పడడం, ఆమెకి రౌడీ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం, ఆమెని దక్కించుకోవడం కోసం వాళ్లతో హీరో ఫైట్ చేయడం.. అనే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ట్రైలర్‌లోని సగభాగం వరకు హీరో-హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్, కామెడీ ఎపిసోడ్లతో నింపేశారు. చూస్తుంటే.. సినిమాలో మనోజ్, ప్రగ్యాల మధ్య రొమాన్స్ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక కామెడీ కూడా హిల్లేరియస్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక మిగతా సగభాగం మొత్తం ఊర మాస్‌తో నింపేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ అదిరాయి. డైలాగులు కూడా సూపర్బ్‌గా ఉన్నాయి. ‘భూమ్మీద దేవతలు తిరుగుతుంటే.. యుద్ధాలు చేయాలి బావ’, ‘సత్తా ఉన్నోడ్ని చూస్తే.. చావుక్కూడా పడిపోద్ది’ అని మనోజ్ చెప్పే డైలాగులతోపాటు ‘మొగుడ్నైనా మ్యానేజ్ చేయొచ్చుగానీ.. రంకుమొగుడ్ని మ్యానేజ్ చేయడం చాలా కష్టం’ అని కోట చెప్పే డైలాగ్ బాగా పేలింది.

మంచు మనోజ్ అటు లవర్‌బాయ్‌గా, ఇటు ఊరమాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టేశాడు. తన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్గుగా పర్ఫెక్ట్ రోల్ చేశాడనేలా కుమ్మేశాడు. ప్రగ్యా జైస్వాల్ చాలా అందంగా కనిపించింది. విలన్ క్యారెక్టర్‌లో సంపత్ ఎప్పట్లాగే తన మంచి ప్రదర్శన కనబరిచాడు. కోట శ్రీనివాస్ రావ్ క్యారెక్టర్ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కానుందని చెప్పుకోవచ్చు. రావ్ రమేష్, రాజేంద్ర ప్రసాద్‌లు ఆకట్టుకున్నారు. టెక్నికల్ పరంగా చూస్తే.. డైరెక్టర్ సత్య మేకింగ్ చాలా బాగుంది. మాస్ సీన్లను ఎలివేట్ చేస్తూ హైలైట్‌గా తీశాడు. సినిమాటోగ్రఫీ అదిరింది. ఈ ట్రైలర్‌ని ఎడిట్ చేసిన వారికి మంచి మార్కులు వేయాల్సిందే. శ్రీ వసంత్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మైండ్‌బ్లోయింగ్. హాలీవుడ్ రేంజ్‌లో ఇరగదీసేశాడు. ఓవరాల్‌గా.. అన్నీ మాస్ మసాలా ఎలిమెంట్స్‌తో నిండిన ఈ ట్రైలర్ చాలా బాగుంది. సినిమాపై అంచనాల్ని పెంచేసింది.

Share Your Thoughts

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , ,
Latest Telugu Movie News
తారక్ 27వ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్..
‘ఖైదీ నెం.150’ 6 రోజుల కలెక్షన్స్.. అప్పుడే ఆ క్లబ్‌లో చేరిపోయిన మెగాస్టార్
‘లోకల్’ పవర్ చూపించిన నాని.. రెండు రోజుల్లో ట్రైలర్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్
‘శాతకర్ణి’ 5 రోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ పాసైన బాలయ్య
‘శతమానం భవతి’ మూడు రోజుల కలెక్షన్స్.. దిగ్గజాలను సైతం వణికించింది!
క్రిష్ మెడకు చుట్టుకున్న ‘శాతకర్ణి’ కొత్త వివాదం.. చరిత్రపై వివరణ ఇవ్వాల్సిందేనా!
ఓవర్సీస్‌లో ఖైదీ, శాతకర్ణిల అసలు లెక్కలివే!
బాలయ్య డైరెక్టర్‌పై మెగాస్టార్ ప్రశంసలు.. ఇలాంటి అనుభవం ఎప్పుడూ చూడలేదంటున్న క్రిష్
ఆ లోపాన్ని ఒప్పుకున్న బాలయ్య నిజాయితీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
‘ఖైదీ నెం.150’ 5 రోజుల వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్.. 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన బాస్!!
Latest Telugu News
టాలీవుడ్ స్టార్ హీరోలపై కాజల్ కామెంట్స్
ప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి
ఆ అరుదైన గౌరవం దక్కించుకుని.. చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్
అతడికి 13.. ఆమెకు 25.. ఆ పని చేసినందుకు టీచర్‌కి పదేళ్ల జైలు శిక్ష
భళా పులోమావి భళా.. ఎన్టీఆర్ డైలాగ్‌ని అలవోకగా చెప్పేసిన ‘శాతకర్ణి’ కుమారుడు
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ‘శాతకర్ణి’
బాలయ్య శాతకర్ణి కోసం ఎన్టీఆర్ మరో సూపర్బ్ స్టెప్!!
బంజారాహిల్స్‌లో తప్పతాగి రచ్చరచ్చ చేసిన యువతి
బెంగుళూరులో నాలుక కొరికారన్న అమ్మాయి….అసలు కథలో థ్రిల్లర్‌ని మించిన ట్విస్ట్
ఖైదీ ఫంక్షన్‌కి పవన్ ఎందుకు రాలేదో చెప్పేసిన చిరంజీవి!!
Telugu Latest Gossips
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. అల్లు అర్జున్ ‘అదుర్స్’
మాస్టర్ ప్లాన్‌తో ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చిన రవితేజ
చిరంజీవి, బాలయ్య కాంబినేషన్‌.. రక్తికట్టించేందుకు మరో స్టార్ హీరో?
‘శాతకర్ణి’ ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా.. బాలయ్య దేశం మీసం తిప్పడం గ్యారంటీ అంటున్న ట్రేడ్ వర్గాలు
తారక్ 27వ సినిమాకి తాత టైటిల్ ఫిక్స్.. ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిష్టర్ చేసిన కళ్యాణ్ రామ్
‘ఖైదీ నెం.150’ ఫస్ట్ డే కలెక్షన్స్.. హిస్టారికల్ రికార్డ్ తప్పదంటున్న ట్రేడ్ వర్గాలు
చిరంజీవికి ఇచ్చినట్లుగా మహేష్‌కి పూరీ జగన్నాథ్ కౌంటర్..?
ఖైదీలో కనిపించనున్న మెగా హీరోలు ఎవరు? ఎంతసేపు? ఫుల్ డిటెయిల్స్
ఎన్టీఆర్ గ్రేట్, ఎన్టీఆర్ గ్రేటెస్ట్, ఎన్టీఆర్ బెస్ట్…కెరీర్ ప్లానింగ్ కేక!!
మెగా 150 ఫ్యాన్స్ కోసమే…ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుందట!!
Latest Videos
ప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి
‘లోకల్’ పవర్ చూపించిన నాని.. రెండు రోజుల్లో ట్రైలర్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్
ప్రేమ పేరుతో రామ్ లవర్‌ని తెగ ఇబ్బంది పెట్టిన ‘లోకల్’ నాని
మాస్‌లో క్లాస్ మిక్స్ చేసి.. ‘విన్నర్’ అనిపించుకున్న మెగాహీరో
భళా పులోమావి భళా.. ఎన్టీఆర్ డైలాగ్‌ని అలవోకగా చెప్పేసిన ‘శాతకర్ణి’ కుమారుడు
అమ్మడుతో బాలయ్య కుమ్ముడు.. యూట్యూబ్‌పై నెటిజన్ల దండయాత్ర (వీడియో)
ట్రైలర్ టాక్ : హాలీవుడ్‌ని తలపించేలా ‘ఘాజీ’ సబ్-మెరీన్ వార్ అదిరింది
ట్రైలర్ టాక్ : రంకుమొగుడి సత్తా చాటిన ‘గుంటూరోడు’
టీజర్ టాక్ : ఇల్లు-వాకిలి, ప్రేమా-దోమా, చెత్త-చెదారం అన్ని పక్కనపెట్టమంటున్న ‘గురు’
బంజారాహిల్స్‌లో తప్పతాగి రచ్చరచ్చ చేసిన యువతి