‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రీ-రివ్యూ.. క్రిష్, బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

gautamiputra satakarni pre review rating

gautamiputra satakarni pre review rating

News: gautamiputra satakarni pre review rating – Here is the exclusive pre-review of Balayya’s prestigious 100th project Gautamiputra Satakarni. This movie directed by Krish and produced by Saibabu Jagarlamudi, Y Rajeev Reddy under First Frame Entertainment banner. Shriya Saran played female lead role and Bollywood dreamgirl Hema Malini done Balayya’s mother Gautami character.

gautamiputra satakarni pre review rating casting :

  • సినిమా : గౌతమీపుత్ర శాతకర్ణి
  • నటీనటులు : బాలకృష్ణ, శ్రియా శరన్, హేమమాలిని, కబీర్ బేడీ, శివ రాజ్‌కుమార్, తదితరులు
  • కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : క్రిష్
  • నిర్మాతలు : సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి
  • బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
  • మ్యూజిక్ : చిరంతన్ భట్
  • సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ వీఎస్
  • ఎడిటర్స్ : సూరజ్ జగ్‌తాప్, రామకృష్ణ ఆర్రం

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బాలయ్య చేసిన తన మైల్‌స్టోన్ వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రీ.శ.1-2 శతాబ్దాలకాలం నాటి శాతవాహనుల చక్రవర్తి శాతకర్ణి నిజజీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయినరోజే.. దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చిపడింది. బాలయ్య తన 100వ చిత్రం కోసం సరైన కథాంశాన్ని ఎంచుకున్నారని పాజిటివ్ రెస్పాన్స్ రావడం మొదలైంది. అందుకు తగినట్లుగానే పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్స్ రిలీజ్ అవ్వడంతో.. ఈ చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? వెయిట్ చేయాల్సిందే.

కథ :

అది క్రీ.శ.1-2 మధ్యకాలానికి చెందిన కథ. అప్పట్లో భారతదేశం ఒకతాటిపై కాకుండా చిన్నచిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉండేది. రాజులందరూ ఇతర రాజ్యాల గురించి పట్టించుకోకుండా తమ రాజ్యపాలన చేసుకుంటూ ఉంటారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న తరుణంలో.. ఆంగ్లేయులు దేశం మీద దండయాత్ర చేస్తారు. ఒక్కొక్క గణతంత్ర రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు రాజులు తమ సొంత స్వలాభాల కోసం ఆ ఆంగ్లేయులకు సామంతులవుతారు.

ఇక శాతవాహనుల రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలని వాళ్లు ప్రయత్నిస్తారు. కానీ.. ఆ రాజ్య చక్రవర్తి అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అలా జరగనివ్వకుండా.. వారిపై తిరుగుబాటు చేస్తాడు. పరాయి దేశం వాళ్లని తరిమికొడదామన్న లక్ష్యంతో ముందుకు సాగుతాడు. ఇది తన ఒక్కడివల్లే సాధ్యం అవ్వదని, అందరూ కలిస్తేనే సాధ్యమవుతుందని భావించి.. గణతంత్ర రాజ్యాలుగా ఉండే భారతావనని ఒకే పాలనలోకి తీసుకొచ్చేందుకు పిలుపునిస్తాడు. అతని పిలుపు మేరకు అన్ని రాజ్యాలు కదిలొస్తాయి. దీంతో.. శాతకర్ణికి గొప్ప పేరు వస్తుంది.

ఇది సహించలేకపోయిన మరో రాజు.. శాతకర్ణికి వ్యతిరేకంగా ఆంగ్లేయులతో కలిసి వ్యూహాలు రచించడం ప్రారంభిస్తాడు. శాతకర్ణికి దగ్గరే ఉంటూ.. సీక్రెట్స్‌ని దొంగలించడమే కాకుండా, అతన్ని అంతమొందించేందుకు ప్రణాళికలు రచిస్తాడు. ఈ విషయం శాతకర్ణికి ఎలా తెలిసింది? వారి వ్యూహాల్ని ఎలా ఎదుర్కొంటాడు? దేశం కోసం ఆయన చేసిన సేవలేమిటి? చివరికి ఏమైంది? అనే అంశాలతో ఈ సినిమా కథ ఉంటుంది.

విశ్లేషణ:

చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కే సినిమాల్లో.. పెద్దపెద్ద భవంతులు, వేలాదిమంది యోధులు, కళ్లు చెదిరే లొకేషన్లు, వీరోచిత యుద్ధ సన్నివేశాలు తప్పనిసరి. ఇందుకోసం చాలా సమయమే పడుతుంది. ఎంతలేకున్నా.. సంవత్సరంపైనే అవుతుంది. కానీ.. దర్శకుడు క్రిష్ కేవలం 8 నెలల్లోనే ఈ అద్భుత కళాఖండాన్ని తెరకెక్కించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కళ్లుచెదిరే గ్రాఫిక్స్, భారీ యుద్ధ సీన్లు.. రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. అసలు ఇంత తక్కువ సమయంలో అంత అద్భుతమైన ఔట్‌పుట్ రాబట్టడంలో క్రిష్ చేసిన కృషిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అతను చెప్పినట్లుగానే.. ప్రతి తెలుగువాడు గర్వపడేలా ఈ సినిమాని తెరకెక్కించాడు.

కథా విషయానికొస్తే.. ఈ సినిమా ప్రారంభమే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలు కూడా హత్తుకునేలా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు అమోఘంగా వున్నాయి. ముఖ్యంగా.. సముద్రంలో నావికా యుద్ధం హాలీవుడ్‌ని తలపించేలా ఉంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. ఫస్టాఫ్‌లాగే సెకండాఫ్ కూడా వీరోచిత వార్ సన్నివేశాలతో రసవత్తరంగా సాగుతుంది. మధ్యలో శాతకర్ణి, తల్లి గౌతమీ, భార్య మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ టచ్ చేస్తాయి. ఇందులో శాతకర్ణి తన చేతిలో కుమారుడ్ని పట్టుకునే చేసే యుద్ధం మరో హైలైట్. ఈ సీన్‌కి థియేటర్స్ విజిల్స్‌తో దద్దరిల్లాల్సిందే. ఇక క్లైమాక్స్ అయితే ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓ మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్‌తో కథని ముగించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

ఓవరాల్‌గా చూసుకుంటే.. ఎమోషనల్ సన్నివేశాలు కాస్ల స్లోగా సాగినట్లు అనిపిస్తాయి తప్పితే మిగతా సినిమా మొత్తం వేగంగా సాగిపోతుంది. ఈ సినిమాకి వార్ సీన్లే మేజర్ ప్లస్ పాయింట్స్. వాటిని రొటీన్ ఫార్మాట్‌లో కాకుండా తనదైన స్టైల్‌లో అద్భుతంగా తీశాడు. ఈ చిత్రానికి మరో కలిసొచ్చే అంశం.. రన్‌టైం కేవలం 2 గంటల 15 నిముషాలు మాత్రమే ఉండడం. దీంతో.. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా వేగంగా నడుస్తుంది. బాలయ్య తన నటనతో, క్రిష్ తన ప్రతిభతో.. ఈ సినిమాని అద్భుతంగా వచ్చేలా చేశారు.

నటీనటుల పనితీరు :

నటసింహంగా పేరుగాంచిన బాలయ్య ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారన్న విషయం అందరికీ తెలుసు. ‘శాతకర్ణి’ పాత్రలోనూ ఆయన ఒదిగిపోయారు.. సారీ జీవించేశారు. ఈ వయసులోనూ డూప్స్ లేకుండా వార్ సన్నివేశాలు చేయడం నిజంగా గొప్ప విషయమే. ఈ పాత్రకి ఈయన సరిపోలేదని నెగెటివ్‌గా కామెంట్స్ చేసిన వారికి చెంప ఛెళ్లుమనిపించేలా బాలయ్య సమాధానం ఇచ్చారు. ఇక శాతకర్ణి సతీమణిగా శ్రియాశరన్ బాగానే నటించింది. అక్కడక్కడ అందాలను బాగానే ఆరబోసింది. బాలయ్య, శ్రియాల మధ్య కెమెస్ట్రీ కూడా అదిరింది. బాలయ్య తల్లిగా హేమమాలిని అద్భుత అభినయం కనబరిచారు. ఆ పాత్రకు ఆమె తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరేమో అన్నంతగా ఆకట్టుకున్నారు. విలన్‌గా కబీర్ బేడీ చాలా బాగా నటించాడు. ఇతర నటీనటులు తమతమ పాత్రల పరిధి మెప్పించారు.

సాంకేతిక పనితీరు :

ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతం. ఆయన కెమెరా పనితనానికి ఎన్ని మార్కులు వేసినా తక్కువ. క్రీ.శ.1-2 మధ్యకాలానికి చెందిన చారిత్రక నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు వెండితెరపై చూపించిన తీరు అమోఘం. చిరంతన్ భట్ అందించిన సంగీతం చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేశాడు. ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి మరో ప్రాణం పోసింది. ఎడిటింగ్ బాగుంది. సాయిబాబు, రాజీవ్ రెడ్డిల నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు.

ఇక క్రిష్ గురించి మాట్లాడితే.. అతను ఎంచుకున్న కథని వెండితెరపై ఎగ్జిక్యూట్ చేయడంలో నూటికి నూరు శాతం పాసయ్యాడు. ఇలాంటి భారీ చిత్రాన్ని కేవలం 8 నెలల్లో అద్భుతమైన ఔట్‌పుట్‌తో కంప్లీట్ చేయడం నిజంగా గర్వించదగ్గర విషయం.

ఇలాంటి ప్రాజెక్ట్‌ని అతను డీల్ చేసిన విధానానికి ఎంత ప్రశంసించినా తక్కువే. ఆల్రెడీ టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరుగాంచిన క్రిష్.. ఈ సినిమాతో అందనంత స్థాయికి ఎదిగిపోయాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

ఫైనల్ వర్డ్ : ఈ చిత్రం చరిత్ర తిరిగరాయాలని, తెలుగువారు గర్వపడేలా చేయాలని తెలుగులైవ్స్.కామ్ సైట్ ఆశిస్తూ.. gautamiputra satakarni pre review rating : 4/5

Read this review in English : Gautamiputra satakarni telugu movie review rating updates

Summary
Review Date
Reviewed Item
గౌతమీపుత్ర శాతకర్ణి ప్రీ-రివ్యూ
Author Rating
4

Share Your Thoughts

comments

Tags: , , , , , , , ,
Latest Telugu Movie News
తారక్ 27వ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్..
‘ఖైదీ నెం.150’ 6 రోజుల కలెక్షన్స్.. అప్పుడే ఆ క్లబ్‌లో చేరిపోయిన మెగాస్టార్
‘లోకల్’ పవర్ చూపించిన నాని.. రెండు రోజుల్లో ట్రైలర్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్
‘శాతకర్ణి’ 5 రోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ పాసైన బాలయ్య
‘శతమానం భవతి’ మూడు రోజుల కలెక్షన్స్.. దిగ్గజాలను సైతం వణికించింది!
క్రిష్ మెడకు చుట్టుకున్న ‘శాతకర్ణి’ కొత్త వివాదం.. చరిత్రపై వివరణ ఇవ్వాల్సిందేనా!
ఓవర్సీస్‌లో ఖైదీ, శాతకర్ణిల అసలు లెక్కలివే!
బాలయ్య డైరెక్టర్‌పై మెగాస్టార్ ప్రశంసలు.. ఇలాంటి అనుభవం ఎప్పుడూ చూడలేదంటున్న క్రిష్
ఆ లోపాన్ని ఒప్పుకున్న బాలయ్య నిజాయితీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
‘ఖైదీ నెం.150’ 5 రోజుల వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్.. 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన బాస్!!
Latest Telugu News
టాలీవుడ్ స్టార్ హీరోలపై కాజల్ కామెంట్స్
ప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి
ఆ అరుదైన గౌరవం దక్కించుకుని.. చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్
అతడికి 13.. ఆమెకు 25.. ఆ పని చేసినందుకు టీచర్‌కి పదేళ్ల జైలు శిక్ష
భళా పులోమావి భళా.. ఎన్టీఆర్ డైలాగ్‌ని అలవోకగా చెప్పేసిన ‘శాతకర్ణి’ కుమారుడు
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ‘శాతకర్ణి’
బాలయ్య శాతకర్ణి కోసం ఎన్టీఆర్ మరో సూపర్బ్ స్టెప్!!
బంజారాహిల్స్‌లో తప్పతాగి రచ్చరచ్చ చేసిన యువతి
బెంగుళూరులో నాలుక కొరికారన్న అమ్మాయి….అసలు కథలో థ్రిల్లర్‌ని మించిన ట్విస్ట్
ఖైదీ ఫంక్షన్‌కి పవన్ ఎందుకు రాలేదో చెప్పేసిన చిరంజీవి!!
Telugu Latest Gossips
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. అల్లు అర్జున్ ‘అదుర్స్’
మాస్టర్ ప్లాన్‌తో ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చిన రవితేజ
చిరంజీవి, బాలయ్య కాంబినేషన్‌.. రక్తికట్టించేందుకు మరో స్టార్ హీరో?
‘శాతకర్ణి’ ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా.. బాలయ్య దేశం మీసం తిప్పడం గ్యారంటీ అంటున్న ట్రేడ్ వర్గాలు
తారక్ 27వ సినిమాకి తాత టైటిల్ ఫిక్స్.. ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిష్టర్ చేసిన కళ్యాణ్ రామ్
‘ఖైదీ నెం.150’ ఫస్ట్ డే కలెక్షన్స్.. హిస్టారికల్ రికార్డ్ తప్పదంటున్న ట్రేడ్ వర్గాలు
చిరంజీవికి ఇచ్చినట్లుగా మహేష్‌కి పూరీ జగన్నాథ్ కౌంటర్..?
ఖైదీలో కనిపించనున్న మెగా హీరోలు ఎవరు? ఎంతసేపు? ఫుల్ డిటెయిల్స్
ఎన్టీఆర్ గ్రేట్, ఎన్టీఆర్ గ్రేటెస్ట్, ఎన్టీఆర్ బెస్ట్…కెరీర్ ప్లానింగ్ కేక!!
మెగా 150 ఫ్యాన్స్ కోసమే…ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుందట!!
Latest Videos
ప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి
‘లోకల్’ పవర్ చూపించిన నాని.. రెండు రోజుల్లో ట్రైలర్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్
ప్రేమ పేరుతో రామ్ లవర్‌ని తెగ ఇబ్బంది పెట్టిన ‘లోకల్’ నాని
మాస్‌లో క్లాస్ మిక్స్ చేసి.. ‘విన్నర్’ అనిపించుకున్న మెగాహీరో
భళా పులోమావి భళా.. ఎన్టీఆర్ డైలాగ్‌ని అలవోకగా చెప్పేసిన ‘శాతకర్ణి’ కుమారుడు
అమ్మడుతో బాలయ్య కుమ్ముడు.. యూట్యూబ్‌పై నెటిజన్ల దండయాత్ర (వీడియో)
ట్రైలర్ టాక్ : హాలీవుడ్‌ని తలపించేలా ‘ఘాజీ’ సబ్-మెరీన్ వార్ అదిరింది
ట్రైలర్ టాక్ : రంకుమొగుడి సత్తా చాటిన ‘గుంటూరోడు’
టీజర్ టాక్ : ఇల్లు-వాకిలి, ప్రేమా-దోమా, చెత్త-చెదారం అన్ని పక్కనపెట్టమంటున్న ‘గురు’
బంజారాహిల్స్‌లో తప్పతాగి రచ్చరచ్చ చేసిన యువతి