Specialsదారుణం: ప్రముఖ కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ పై ప్రచారం అంతా...

దారుణం: ప్రముఖ కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ పై ప్రచారం అంతా అబద్దం!!

సినిమా.. ఇదో రంగుల ప్ర‌పంచం! ఈ గ్లామ‌ర్ ప్ర‌పంచానికి క్వీన్ అవ్వాల‌నే క‌ల‌ చాలా మంది అమ్మాయిల‌కి ఉంటుంది. అందుకే కెరీర్ తొలినాళ్ల‌లో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కైనా ఒప్పుకుంటారు. రోజులు గ‌డుస్తున్న కొద్దీ వారికి అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డంతో ఒక‌ప్ప‌టి హీరోయిన్లే ఇప్ప‌టి కేరెక్ట‌ర్ ఆర్టిస్టులు అయిపోతున్నారు. హీరోయిన్‌గా చేసిన సినిమాల్లో కొన్ని రొమాంటిక్ సీన్ల‌కు సంబంధించిన వీడియోల ఆధారంగా కొన్ని సైట్లు మితిమీరిపోతున్నాయి. వారు అవ‌కాశాల కోసం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు, ముఖ్యంగా సెమీ పోర్న్ చిత్రాల్లో న‌టించార‌ని కొన్ని వెబ్‌సైట్లు నిరాధార వార్త‌లను ప్ర‌చురిస్తున్నాయి. ప్ర‌స్తుతం కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ‌కు సంబంధించిన ఒక వార్త వైర‌ల్‌గా మారింది.

కామెడీ చేసే అతి కొద్ది మంది మ‌హిళా ఆర్టిస్టుల్లో హేమ ముందు వ‌రుస‌లో ఉంటారు. హీరోయిన్‌గా కొన్ని త‌మిళ సినిమాల్లో న‌టించిన ఆమె.. ప్రస్తుతం తెలుగులో కేరెక్ట‌ర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నారు. త‌నికెళ్ల భ‌రణి, బ్ర‌హ్మానందం, కృష్ణ భ‌గ‌వాన్ వంటి సీనియ‌ర్ న‌టులతో న‌టించి.. త‌న హాస్యంతో సినీ ప్రేక్ష‌కుల‌కు గిలిగింత‌లు పెట్టారు. అయితే ఆమె తెలుగు కంటే ముందు కొన్ని త‌మిళ చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించిన‌ద‌న్న విష‌యం చాలా త‌క్కువ మందికి తెలుసు. మంచి క‌థాబ‌లం ఉన్న సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ సినిమాల‌కు సంబంధించిన వీడియోలో హేమ‌.. ఒకింత‌ గ్లామ‌ర్ ఒలికించింది. ఈ వీడియో ఆధారంగా చేసుకుని కొన్ని సైట్లు నైతిక విలువ‌ల‌కు గుడ్ బై చెప్పేశాయి. సన్నివేశానికి ప్రాధాన్యం ఇచ్చి త‌మ‌కు అనుగుణంగా మార్చుకుని లేనివి ఉన్నట్లు రాసేశాయి. హేమ గ్లామ‌ర్‌పై పోర్న్ ముద్ర‌వేసిన సైట్ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సోష‌ల్ మీడియా విస్తృతి నానాటికీ విస్తృత‌మ‌వుతున్న త‌రుణంలో ఇటువంటి వార్త‌ల‌పై అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news